
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట పెద్దల నుంచి రక్షణ కల్పిం చాలని కోరుతూ గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీ పట్నం భాస్కరపురానికి చెందిన బొడ్డు భవానీ శంకర్ డిగ్రీ చదువుకున్నాడు. హెడ్‌డీసీ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. రుస్తుం బాదుకు చెందిన అనుమకొండ నవ్యదుర్గా బీటెక్ ఫైనలియర్ చదువుకుంటోంది. వీరిద్దరి మధ్య మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ విషయం నవ్యదుర్గ ఇంట్లో తెలిసింది. ఇరువురివి వేర్వేరు కులా లు కావటంతో కుటుంబసభ్యులు నవ్యకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో గురువారం ఇరువురు ఇంట్లో చెప్పకుండా ఏలూరు వెళ్లి బౌద్ధ్దధర్మ ప్రచార ట్రస్ట్‌లో ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణను కలసి పెద్దల నుంచి రక్షణ కోరారు. ఆయన మచిలీపట్నంస్టేషన్‌కు సిఫార్సు చేశారు.