రెండేళ్లుగా.... | Khammam: Couple Who Got Married Recently Seeks Police Protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Published Fri, Jul 16 2021 10:13 AM | Last Updated on Fri, Jul 16 2021 12:11 PM

Khammam: Couple Who Got Married Recently Seeks Police Protection - Sakshi

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సై 

సాక్షి, కామేపల్లి(ఖమ్మం): ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పింజరమడుగు గ్రామానికి చెందిన కర్రి దేవా, తాళ్లగూడెంకు చెందిన బండారి కావ్యలు డిగ్రీ చదువుతున్నారు. వీరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కావ్యకు తల్లిదండ్రులు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా గత తొమ్మిది రోజుల కిందట ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని..గురువారం కామేపల్లి ఠాణాకు వచ్చారు.

ఎస్సై జి.స్రవంతి ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మేజర్లు కావడం, విడిపోడానికి ఇష్టపడకపోవడంతో కావ్యను అబ్బాయి దేవా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామపెద్దలు వీరిద్దరికీ తాళ్లగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement