
సాక్షి, విశాఖపట్నం : నగరంలోని సుందరయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ కొత్త జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖలోని సుందరయ్య కాలనీకి చెందిన నాగిణికి ఐదేళ్ల క్రితం పాపారావు అనే వ్యక్తితో వివాహమైంది. ఏడాది క్రితం భర్తతో విడిపోయి వేరుగా ఉంటోందామె. ఈ నేపథ్యంలో అభిలాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. నాగిణి ప్రేమ వ్యవహారం అండమాన్‌లో ఉన్న భర్త పాపారావుకు తెలిసింది. ( డేటింగ్ యాప్: నగ్నంగా వీడియో కాల్..)
తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులక్రితం నాగిణి, అభిలాష్‌లు వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి బ్రతకలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ( కాలేజీ క్లర్కుతో ఎఫైర్: 21 ఏళ్లుగా.. )
Comments
Please login to add a commentAdd a comment