పీఎస్‌ ఎదుట జ్యోతి కుటుంబ సభ్యుల ధర్నా | Guntur Love Couple Murder VIctim Family Members Dharna At Mangalagiri PS | Sakshi

పీఎస్‌ ఎదుట జ్యోతి కుటుంబ సభ్యుల ధర్నా

Feb 13 2019 7:17 PM | Updated on Feb 13 2019 7:19 PM

Guntur Love Couple Murder VIctim Family Members Dharna At Mangalagiri PS - Sakshi

సాక్షి, గుంటూరు  : అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసు పోలీసులు సరిగా విచారించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైటాయించారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని జ్యోతి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. తమ బంధువులను విచారిస్తున్నారు కానీ తాము చెప్పిన వారిని విచారించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (రాజధానిలో ప్రేమజంటపై దాడి)

గత సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా..  శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇది చదవండి : జ్యోతి వాచ్‌, బట‍్టలు కావాలన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement