mangalagiri police station
-
సీమరాజా యూట్యూబ్ ఛానల్‌పై ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసభ్యకరమైన భాష వాడుతున్నారని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో సీమరాజా యూట్యూబ్ ఛానల్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వేమారెడ్డి పేర్కొన్నారు. -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తావా?
సాక్షి, మంగళగిరి: మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు మంగళగిరి రూరల్ పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భాగంగా టీడీపీ కార్యాలయంలో పనిచేసే నాయబ్ రసూల్‌ను సోమవారం మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు లోకేష్, అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్, దీపక్‌రెడ్డి హుటాహుటిన మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకున్నారు. ‘‘మా కార్యాలయంలో పనిచేసే వారినే అరెస్ట్ చేస్తావా? ఎవరు ఇచ్చారు మీకు అధికారం?’’ అంటూ సీఐపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ రెచ్చిపోయారు. సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా తాను ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నానని, ఇప్పటి వరకూ తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. సీఐ మాటలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. చట్టాలు మాకు నేర్పుతావా అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో పెట్టింది తప్పు అని చట్టంలో ఎక్కడ రాసి ఉందో చూపాలంటూ చిందులు వేశారు. (చదవండి: ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!) -
నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
సాక్షి, అమరావతి: దళితుల వల్లే దరిద్రం అని అహంకారంగా మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న చినకాకాని మహిళా ఎస్సై అనూరాధను ఉద్దేశించి అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజా ప్రతినిధులు దళితులపై రకరకాల పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, వ్యంగ్యంగా మాట్లాడినా చర్యలు తీసుకున్న సందర్భాలు లేనందునే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎస్సైకి తగిన రక్షణ కల్పించి, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మల దగ్ధం తెనాలి : దళిత ఎస్ఐ విధులను ఆటంకపరుస్తూ ‘దళితుల వలన ఈ దరిద్రం పట్టింది’ అంటూ దళితులను కించపరచేలా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలకు నిరసనగా, దీనిని ఖండించని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మలను పట్టణ గాంధీచౌక్‌లో గురువారం దహనం చేశారు. టీడీపీ పల్నాడులో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, న్యాయవిభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లాలోని పెదకాకాని ఎస్ఐ అనూరాధ విధుల్లో ఉండగా, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి వనితలు పరుష పదజాలంతో దూషించి దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని మండల తహసీల్దార్, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో అందజేశారు. పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కనపర్తి అనిల్, రాష్ట్ర కార్యదర్శి కె.దేవయ్య, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎం విల్సన్, డి.మల్లికార్జునరెడ్డి, జె.ఎలిజబెత్ రాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాదరావు, కొమ్ము రాయల్ పాల్గొన్నారు. దళితులకు క్షమాపణ చెప్పాలి తెనాలి టౌన్ : దళిత ఎస్ఐ విధులకు ఆటకం కలిగిస్తూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావూరి రవిబాబు (జెవీఆర్) గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారి దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవయ్య డిమాండ్ చేశారు. రాజకుమారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మహిళా ఎస్ఐని అవమానించిన మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంతేటి యలమందరావు డిమాండ్ చేశారు. గురువారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు.శోభన్‌బాబును కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐపై రాజకుమారి బృందం వేలు చూపిస్తూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కుక్కల రాంప్రసాద్, కూరపాటి సరస్వతి, బెజ్జం గోపి, బండి ప్రసాద్, బండ్లమూడి బానుకిరణ్, పాటిబండ్ల విల్సన్‌బాబు తదితరులు ఉన్నారు. ఆళ్లమూడిలో నిరసనలు భట్టిప్రోలు: నన్నపనేని రాజకుమారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతర రాజకుమారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యదర్శి పంతగాని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సాటి మహిళ అని చూడకుండా పెదకాకాని మహిళా ఎస్ఐ అనూరాధపై దుర్భాషలాడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాంచారయ్య, ప్రవీణ్‌కుమార్, వెంకట్రావు, అశోక్, ప్రశాంత్‌రాజ్, చంటి పాల్గొన్నారు. పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని కోళ్లపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో నాగరాజు, చీకటి నాగేశ్వరరావు, బుస్సా మణేశ్వరరావు, ఎన్ నాగరాజు, దోవా సంసోన్, సూర్యచంద్రరరావు పాల్గొన్నారు. రాజకుమారి ఇలా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని) -
300 కేజీల గంజాయి పట్టివేత
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్గేట్ వద్ద మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నైకి కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందడంతో మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, తన సిబ్బందితో అప్రమత్తమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్టేషన్ నుంచి కాజ టోల్గేట్ వద్దకు వెళ్లే సమయంలో జాతీయ రహదారిపై పోలీసు వాహనం ఎదురు ఏపీ 16 ఏపీ 9599 నంబరు కారు వేగంగా వెళ్లడాన్ని గమనించారు. దీంతో పోలీసులు సినీఫక్కీలో ఆ వాహనాన్ని వెంబడించారు. వాహనం కాజ టోల్గేట్ 3వ కానా వద్ద ఆగి ఉండడంతో పోలీసు వాహనంలోని సిబ్బంది దిగి వాహనం వద్దకు వెళ్లేలోపే, స్కార్పియో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసు వాహనాన్ని గమనించి పారిపోగా పోలీసులు వారిని వెంబడించారు. ఆ సమయంలో బాగా చీకటిగా ఉండటంతో వారు తప్పించుకొని వెళ్లిపోయారు. పోలీసులు టోల్‌ప్లాజా కానా వద్ద ఆగి ఉన్న వాహనం వద్దకు చేరుకొని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఆ వాహనాన్ని పక్కన పెట్టించారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా, కారులో వెనుకవైపు భాగంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బ్రౌన్ కలర్ కవర్లలో గంజాయి ప్యాక్ చేసి ఉన్న 160 ప్యాకెట్లు కారులో లభ్యమైనట్లు పోలీసులు తెలియచేశారు. ఒక్కో ప్యాకెట్టు 2 కేజీల బరువుంటుందని, 300 కేజీలకు పైగానే ఈ గంజాయి ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. కారులో ఏపీ 07 సీఎఫ్ 0445, ఏపీ 16 బీసీ 9388, టీఎన్ 67 ఎల్ 3435 నంబర్లతో ఉన్న మరో మరో మూడు నంబర్ ప్లేట్లను గుర్తించారు. ఎక్కడా పోలీసులకు అనుమానం రాకుండా నంబర్ ప్లేట్లు మార్చుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు వెనుక వైపు అద్దంపై లాయర్లకు సంబంధించిన స్టిక్కరు అంటించి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పీఎస్ ఎదుట జ్యోతి కుటుంబ సభ్యుల ధర్నా
సాక్షి, గుంటూరు : అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసు పోలీసులు సరిగా విచారించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని జ్యోతి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. తమ బంధువులను విచారిస్తున్నారు కానీ తాము చెప్పిన వారిని విచారించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (రాజధానిలో ప్రేమజంటపై దాడి) గత సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది చదవండి : జ్యోతి వాచ్, బట్టలు కావాలన్నారు -
6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల
-
6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల
గుంటూరు: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన్ను విడుదల చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డిని దాదాపు 6 గంటల పాటు పోలీసులు నిర్బంధించారు. విడుదలైన తర్వాత చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన తాలిబన్ల పాలన కంటే దారుణంగా ఉందని విమర్శించారు. తనను అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమాలను అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను పరామర్శించేందుకు ఐదుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లగా, పోలీసు స్టేషన్ గేట్లు కూడా వేసేసి కనీసం ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. చెవిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సభ జరుగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారని, దీనిపై అడగడానికి ప్రయత్నిస్తే సభలో మైక్ ఇవ్వలేదని చెప్పారు. రవాణా శాఖ కమీషనర్‌పై దాడికి సంబంధించి అడిగితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? చట్టం తన పని తాను చేయకుండా సీఎం అడ్డుతగలడం భావ్యమేనా అని వైఎస్ జగన్ నిలదీశారు. సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి: ఏపీ అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే దీక్ష సారీతో సరి ‘ఇది బాధాకరమైన సంఘటన’ క్షమాపణలు చెప్పిన కేశినేని, బోండా ఉమా బస్సులు ఆపేస్తా.. పార్టీ ముఖ్యం: కేశినేని నాని ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం -
లోపలికి అలోవ్ లేదు:డీఎస్పీ
-
మంగళగిరి స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మంగళగిరి స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవాణా శాఖ ఉన్నతాధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు ఐదుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లగా, పోలీసు స్టేషన్ గేట్లు కూడా వేసేసి కనీసం ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు స్టేషన్ గేటు వెలుపలే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తోటి శాసనసభ్యులుగా ఆయనను పరామర్శించేందుకు వచ్చిన తమను కనీసం స్టేషన్ లోపలకు కూడా అనుమతించకుండా గేట్లు వేసేయడం దారుణమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాసేపు 144 సెక్షన్ ఉందంటున్నారని, మరికాసేపు ఏదో చెబుతున్నారని, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్వయానా ఒక రవాణా కమిషనర్‌కు, ఆయనకు భద్రతగా ఉన్న పోలీసులకు అవమానం జరిగినందుకు నిరసనగా తాము పోరాడుతుంటే ఇప్పుడు పోలీసులు కూడా తమకు సహకరించడం లేదన్నారు. పోలీసులు అసలు తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఇదే ప్రాంగణంలో ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయని, ఇలా గేట్లు వేసేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గేట్లు మూసేయడానికి కారణం ఏంటో చెప్పాలని తాము రాతపూర్వకంగా అడిగినా జవాబు లేదని, ఇన్స్పెక్టర్ను అడిగినా స్పందించడం లేదని అన్నారు. 144 సెక్షన్ ఎప్పటి నుంచి ఉందో చెప్పమన్నా సమాధానం లేదని, ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయంటే ఇంతకంటే దారుణం ఏమీ లేదన్నారు. ఇంతోటి దానికి మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టడమా అని బుగ్గన ఎద్దేవా చేశారు.