ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఏలూరు టౌన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవటంతో ఓ యువతి మరణించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడు ఆ తరువాత తాముంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు బీడీ కాలనీలో శనివారం వేకువ జామున ఈ విషయం వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీడీ కాలనీ గట్టు ప్రాంతంలో నివాసముంటున్న లక్కపాము సుధారాణి(22), తాడి డింపుల్‌కుమార్ (23) ఒకే ఇంట్లో ఉంటూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సుధారాణి భర్త సాయిప్రభు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సాయిప్రభు రెండేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకోవటంతో సుధారాణి అతడిని విడిచిపెట్టి అదే ప్రాంతంలో ఉంటున్న డింపుల్‌కుమార్‌కు దగ్గరైంది. వీరికి కూడా ఓ పాప పుట్టింది.
చదవండి: (రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి)
సుధారాణి మొదటి భర్త సంతానాన్ని ఆమె తల్లి వద్ద ఉంచి పెంచుతోంది. వీరిద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన ఇద్దరూ రాత్రి వేళ మద్యం తాగి తిరుగుతుంటారు. శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన వీరిద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటి సమీపంలో మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో పడిపోయారు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. సుధారాణి తలకు తీవ్రగాయాలు కావటంతో ఘటనా స్థలంలోనే మరణించింది. ఆమె మృతితో భ యపడిన డింపుల్‌కుమార్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి సమీపంలోని తమ ఇంటికి వెళ్లి వెనుకవైపు నుంచి లోపలకు ప్రవేశించి ఫ్యా నుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)
శనివారం వేకువ జామున సుధారాణిని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఆమె ఆధార్ కార్డ్ తీసుకుని ఇచ్చేందుకు సుధారాణి ఇంటికెళ్లారు. తలుపులు వేసి ఉండటంతో తాళం పగులగొట్టి వెళ్లగా డింపుల్ ఉరేసుకుని ఉండటాన్ని గమనించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రూరల్ ఎస్సై లక్ష్మణబాబు కేసు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వాదన మరోలా ఉంది. వీరిద్దరూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, సుధారాణిని డింపుల్‌కుమార్ హత్యచేసి తరువాత భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment