eluru town
-
Eluru Town: యువతిపై లైంగికదాడి.. సీఐపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, ఏలూరు టౌన్: ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పోలీసు శాఖలో అధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏలూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఈ కేసుకు సంబంధించి యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలేమి లేకుండా చేసుకునేందుకు సీఐ తీవ్రంగా ప్రయత్నించారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) అయితే యువతి ఫిర్యాదుపై రాష్ట్రస్థాయి అధికారుల విచారణ నేపథ్యంలో సీఐపై వేటు తప్పదని తెలుస్తోంది. సదరు సీఐ ఇటీవల అటాచ్‌మెంట్‌పై మరో విభాగంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఐను వీఆర్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో సీఐపై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏలూరు రూరల్ స్టేషన్లో గతంలో పనిచేసిన సీఐ, ఎస్సై పై వేటు పడింది. వీరిద్దరిపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. చదవండి: (భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..) -
భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..
సాక్షి, ఏలూరు టౌన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవటంతో ఓ యువతి మరణించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడు ఆ తరువాత తాముంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు బీడీ కాలనీలో శనివారం వేకువ జామున ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీడీ కాలనీ గట్టు ప్రాంతంలో నివాసముంటున్న లక్కపాము సుధారాణి(22), తాడి డింపుల్‌కుమార్ (23) ఒకే ఇంట్లో ఉంటూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సుధారాణి భర్త సాయిప్రభు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సాయిప్రభు రెండేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకోవటంతో సుధారాణి అతడిని విడిచిపెట్టి అదే ప్రాంతంలో ఉంటున్న డింపుల్‌కుమార్‌కు దగ్గరైంది. వీరికి కూడా ఓ పాప పుట్టింది. చదవండి: (రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి) సుధారాణి మొదటి భర్త సంతానాన్ని ఆమె తల్లి వద్ద ఉంచి పెంచుతోంది. వీరిద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన ఇద్దరూ రాత్రి వేళ మద్యం తాగి తిరుగుతుంటారు. శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన వీరిద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటి సమీపంలో మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో పడిపోయారు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. సుధారాణి తలకు తీవ్రగాయాలు కావటంతో ఘటనా స్థలంలోనే మరణించింది. ఆమె మృతితో భ యపడిన డింపుల్‌కుమార్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి సమీపంలోని తమ ఇంటికి వెళ్లి వెనుకవైపు నుంచి లోపలకు ప్రవేశించి ఫ్యా నుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) శనివారం వేకువ జామున సుధారాణిని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఆమె ఆధార్ కార్డ్ తీసుకుని ఇచ్చేందుకు సుధారాణి ఇంటికెళ్లారు. తలుపులు వేసి ఉండటంతో తాళం పగులగొట్టి వెళ్లగా డింపుల్ ఉరేసుకుని ఉండటాన్ని గమనించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రూరల్ ఎస్సై లక్ష్మణబాబు కేసు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వాదన మరోలా ఉంది. వీరిద్దరూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, సుధారాణిని డింపుల్‌కుమార్ హత్యచేసి తరువాత భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు. -
పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య
సాక్షి, ఏలూరు టౌన్ : భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతోపాటు, స్టేషన్‌కు రావాలని పోలీసులు పిలవటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరానికి చెందిన కే.బాలరాజుకు ఏలూరు శివారు చొదిమెళ్ల గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు బాలరాజు. ఇటీవల అత్తింట్లో బంధువు మృతి చెందటంతో బట్టలు పెట్టేందుకు భార్య స్వగ్రామం చొదిమెళ్ల వెళ్లారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) ఈ నేపథ్యంలో ఈ నెల 17న బాలరాజు, జ్యోతి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య చీమలమందు తాగటంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సతో ఆరోగ్యం కోలుకుని ఇంటికి తిరిగివెళ్లింది. భర్త బాలరాజు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, కొడుతున్నాడంటూ జ్యోతి 100 నంబర్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసింది. గురువారం ఉదయం ఏలూరు రూరల్ పోలీసులు బాలరాజుకు ఫోన్ చేసి విచారణ నిమిత్తం రావాలని చెప్పారు. జ్యోతి తన తండ్రిని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) బాలరాజు కూడా స్టేషన్‌కు వెళుతున్నానంటూ చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే స్టేషన్‌కు వెళ్లకుండా పవర్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ప్రైవేట్ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య
సాక్షి, ఏలూరు టౌన్: నిద్రపోతున్న భర్త పురుషాంగంపై సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది ఓ భార్య. హఠాత్తు పరిణామంతో వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టిన భర్తను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరం తాపీమేస్త్రి కాలనీకి చెందిన మాచర్ల నాగేంద్రరావు టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య పద్మావతితో పాటు, ఇంజనీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. నగరంలోని పత్తేబాదలో టైలరింగ్ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా నాగేంద్రరావు, పద్మావతి మధ్య విభేదాలు పొడచూపాయి. శుక్రవారం రాత్రి వారి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. శనివారం ఉదయం భర్త నిద్రిస్తున్న సమయంలో సలసలా మరిగే వేడినీటిని అతని మర్మాంగంపై పడేలా ఒక్కసారిగా పోసేసింది. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు నాగేంద్రరావుకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్‌బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. చదవండి: (ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఆపై..) మూడో భార్యగా పద్మావతి... నాగేంద్రరావుకు పద్మావతి మూడో భార్య. మొదటి, రెండవ భార్యల నుంచి పిల్లలు పుట్టటం లేదనే కారణంగా విడాకులు తీసుకున్నట్టు చెబుతున్నారు. పిల్లలు కావాలనే ఉద్దేశంతో పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు సంతానం కూడా కలిగారు. ఇటీవల కాలంలో వారిమధ్య విభేదాలు తీవ్రస్థాయిలో చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి దిగిందని భావిస్తున్నారు. అసలు ఎందుకు అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలా, వివాహేతర సంబంధాలా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
చంపేందుకు ఎందుకు కన్నావమ్మా!?
నవ మాసాలూ మోసి.. రక్తం పంచిన బిడ్డల్ని అత్యంత దారుణంగా తల్లులే హత్య చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న భర్తతో గొడవ పడి ఓ తల్లి ఏకంగా తన బిడ్డ చేతిని కోసి ప్రాణాలు విడిచే వరకూ అలానే చూస్తుండిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చూశాం. ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రిలోని నీటితొట్టిలో వేసి బిడ్డ ఊపిరి తీసిన తల్లి ఉదంతాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు చూస్తున్నాం. రక్తమాంసాలు పంచిన ‘అమ్మ’లే నిలువునా బిడ్డల ప్రాణాలు తీస్తుంటే.. ఇక బిడ్డలను రక్షించేదెవరు?! సాక్షి, ఏలూరు టౌన్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. చాలా కాలానికి సీతామహాలక్ష్మి గర్భం దాల్చింది. ప్రసూతి కోసం ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, జూలై 30న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డ మళ్లీ అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఏలూరు శంకరమఠం వీధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఈఎన్టీ వైద్యులు చికిత్స అందించారు. ఇదిలా ఉండగా బిడ్డ కోలుకుందని ఈ నెల 11న ఇంటికి వెళ్లొచ్చని వైద్యులు చెప్పారు. హరికృష్ణ బయటికి వెళ్లి తండ్రితో కలిసి హాస్పిటల్‌కు వచ్చేసరికి పాప కనిపించలేదు. ఆస్పత్రి అంతా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆస్పత్రి ప్రాంగణంలోని నీటి తొట్టెలో ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు కిషోర్‌బాబు, నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై తల్లిని ప్రశ్నించగా తన బిడ్డను తానే చంపినట్టు సీతామహాలక్ష్మి చెప్పింది. సీతామహాలక్ష్మికి ఆడబిడ్డ పుట్టటం ఇష్టం లేదని, దీనికి తోడు బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో అస్సలు నచ్చలేదని శనివారం మీడియాతో ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ చెప్పారు. నిందితురాలిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
నీటి తొట్టిలో 12 రోజుల పసికందు.. వీడిన మిస్టరీ.. తల్లే హంతకురాలు
ఏలూరు టౌన్: మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా మారింది. అభం శుభం తెలియని 12 రోజుల పసికందును కనికరం లేకుండా నీళ్ల తొట్టిలో పడేసి హతమార్చింది. ఆపై ఏమీ తెలీదని నాటకాలాడింది. పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బిడ్డను తనే నీటి తొట్టిలో పడేసినట్లు ఒప్పుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఈఎన్టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటి తొట్టిలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్రూమ్కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పారు. అయితే, పోలీసులకు తల్లి సీతామహాలక్ష్మీపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా, బిడ్డను తనే నీటి తొట్టిలో పడేశానని తల్లి అంగీకరించింది. దీంతో ఆమె పోలీసులు అదుపులోకి తీసుకుని కన్నబిడ్డను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. -
నీటి తొట్టిలో 12 రోజుల పసికందు మృతదేహం, అసలు ఏం జరిగింది..?
ఏలూరు టౌన్: ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స కోసం వచ్చి, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఓ పసికందు.. అదే ఆస్పత్రి ఆవరణలో ఓ నీళ్ల తొట్టెలో అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా పడి ఉంది. ఏలూరు నగరంలోని సాయి చిల్డ్రన్ హాస్పిటల్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఈఎన్టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటితొట్టెలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్రూమ్కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. -
ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థిని బలి
ప్రేమోన్మాది వేధింపులు మరో యువతి ప్రాణాలు బలిగొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన ఇందుమతి (18) అనే యువతిపై విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో.. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మరణించింది. అంతకుముందు జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు తమ ఇంటికి ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం వచ్చి.. తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని ఆమె చెప్పింది. ఇందుమతిని విక్కీ రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దాంతో మధ్యలో కొన్నాళ్లు చదువు కూడా ఆపేసింది. తర్వాత ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఇటీవల కొన్నాళ్లుగా అతడు వెంబడిస్తున్నాడు. ఈమధ్యే పదిమంది యువకులతో కలిసి వచ్చి అమ్మాయి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. దాంతో వాళ్లు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విక్కీ తరఫు పెద్దలను పిలిచి హెచ్చరికలు జారీ చేశారు. కేసు కూడా నమోదు చేశారు. శనివారం సాయంత్రం రెండువైపులా పెద్దలను పిలిపించి మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఈలోపే మధ్యాహ్నం చాటపర్రులోని వాళ్ల ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో 90 శాతం కాలిన గాయాలైన ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మరణించింది. నిందితులు ఇద్దరిపైనా నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ప.గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో చిరు జల్లులు
ఏలూరు (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమైంది. అక్కడకక్కడ చినుకులు పడ్డాయి. గురువారం ఉదయం ఏలూరు పట్టణంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.