భర్త ప్రైవేట్‌ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య | Third Wife Pour Boiling Water On Husband Private Parts | Sakshi
Sakshi News home page

భర్త ప్రైవేట్‌ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య

Oct 17 2021 11:04 AM | Updated on Oct 17 2021 11:04 AM

Third Wife Pour Boiling Water On Husband Private Parts - Sakshi

బాధితుడు నాగేంద్రరావు  

సాక్షి, ఏలూరు టౌన్‌: నిద్రపోతున్న భర్త పురుషాంగంపై సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది ఓ భార్య. హఠాత్తు పరిణామంతో వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టిన భర్తను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరం తాపీమేస్త్రి కాలనీకి చెందిన మాచర్ల నాగేంద్రరావు టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య పద్మావతితో పాటు, ఇంజనీరింగ్‌ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. నగరంలోని పత్తేబాదలో టైలరింగ్‌ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

గత కొంతకాలంగా నాగేంద్రరావు, పద్మావతి మధ్య విభేదాలు పొడచూపాయి. శుక్రవారం రాత్రి వారి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. శనివారం ఉదయం భర్త నిద్రిస్తున్న సమయంలో సలసలా మరిగే వేడినీటిని అతని మర్మాంగంపై పడేలా ఒక్కసారిగా పోసేసింది. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు నాగేంద్రరావుకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఏలూరు టూటౌన్‌ సీఐ బోనం ఆదిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.  

చదవండి: (ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఆపై..)

మూడో భార్యగా పద్మావతి... 
నాగేంద్రరావుకు పద్మావతి మూడో భార్య. మొదటి, రెండవ భార్యల నుంచి పిల్లలు పుట్టటం లేదనే కారణంగా విడాకులు తీసుకున్నట్టు చెబుతున్నారు. పిల్లలు కావాలనే ఉద్దేశంతో పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు సంతానం కూడా కలిగారు. ఇటీవల కాలంలో వారిమధ్య విభేదాలు తీవ్రస్థాయిలో చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి దిగిందని భావిస్తున్నారు. అసలు ఎందుకు అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలా, వివాహేతర సంబంధాలా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు.  

చదవండి: (ప్రాణం తీసిన చికెన్‌ గ్రేవీ, శీతల పానీయం?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement