
ప్రతీకాత్మక చిత్రం
ఇద్దరూ టచ్‌లోనే ఉండేవారు. శివరాత్రి పండుగకు శుక్రవారం హురసగుండిగి వెళ్లింది. శనివారం ఉదయం సువర్ణ, ఈశప్పలు కలిసి జీవితంలో కలిసి జీవించడం సాధ్యం కాదని
యశవంతపుర(కర్ణాటక): యాదగిరి జిల్లా శహపుర తాలూకాలో ఘోరం జరిగింది. శివరాత్రి పండుగ రోజున ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శహపుర తాలూకా హురసగుండగి గ్రామానికి చెందిన సువర్ణ (20), ఈశప్ప (22)లు ఐదేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. తల్లిదండ్రులు సువర్ణకు రెండేళ్ల క్రితం మరో యువకునికిచ్చి పెళ్లి చేశారు. భర్తతో కలిసి బెంగళూరులో ఉన్న సువర్ణ.. ప్రియున్ని మరువలేకపోయింది.
ఇద్దరూ టచ్‌లోనే ఉండేవారు. శివరాత్రి పండుగకు శుక్రవారం హురసగుండిగి వెళ్లింది. శనివారం ఉదయం సువర్ణ, ఈశప్పలు కలిసి జీవితంలో కలిసి జీవించడం సాధ్యం కాదని, కలిసి చనిపోవడమే శరణ్యమని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్‌ఐ భార్య, కూతురు మృతి