స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే  | Seema Haider Says Hindustan Zindabad Anju Hoists Pakistan Flag | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకల్లో అక్కడ ఆవిడ.. ఇక్కడ ఈవిడ..  

Published Tue, Aug 15 2023 8:58 AM | Last Updated on Tue, Aug 15 2023 8:58 AM

Seema Haider Says Hindustan Zindabad Anju Hoists Pakistan Flag - Sakshi

ఇస్లామాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రేమికులు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తూ  సరిహద్దులు దాటి మరీ ఏకమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు దేశాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రియురాలు సీమా హైదర్ 'భారత్ జిందాబాద్' అంటూ ఇక్కడ జెండా ఎగురవేస్తే భారత ప్రియురాలు అంజు మాత్రం 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదిస్తూ అక్కడ జెండా ఎగురవేసింది.     

పంద్రాగస్టు వచ్చిందంటే భారత దేశమంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. 77 ఏళ్ల క్రితం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగానికి దక్కిన ప్రతిఫలం స్వాతంత్య్రం. భారత దేశం తోపాటు పాకిస్తాన్‌ కూడా ఇదేరోజున స్వాతంత్య్రం జరుపుకుంటోంది. ఇక్కడలాగే అక్కడ కూడా వారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చినా కూడా ఎవరికి వారు విడివిడిగా జరుపుకుంటూ ఉంటారు. ఆక్కడి వారు ఇక్కడి పతాకాన్ని ఎగరవేయడం కానీ ఇక్కడి వారు అక్కడి పతాకాన్ని కానీ ఎగరెయ్యడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.    

కానీ అలాంటి అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు దేశాంతర ప్రేమికులు సీమా హైదర్, అంజు. నేపాల్ మీదుగా భారత్‌లో అడుగుపెట్టిన సీమా హైదర్ భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేయగా వాఘా బోర్డర్ మీదుగా దాయాది దేశం చేరుకున్న అంజు మాత్రం పాకిస్తాన్‌లో వారి జాతీయ జెండాను ఆవిష్కరించి కేకును కూడా కట్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేళ పాకిస్తాన్‌కు ఘోర అవమానం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement