సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్నదని సొంతకూతురిపై నగరం నడిబొడ్డున పట్టపగలు హత్యాయత్నం చేసిన మనోహరా చారి ఆవేశంతోనే ఈ పనిచేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మనోహరా చారి సాక్షితో మాట్లాడాడు. ‘నా కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆమె పెళ్లి చేసుకున్నప్పడి నుంచి మధ్యం తాగుతూనే ఉన్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు ఇలా ప్రేమ వివాహం చేసుకోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. నా కూతురికి రెండేళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వచ్చాను. అమీర్‌పేటలోని గోవింద్ నగల షాపులో పని చేస్తున్నాను. నాకు పని కల్పించింది నా బామ్మర్ధి’ అని చెప్పాడు.
అతని కూతురే టార్గెట్: డీసీపీ
వనోహరా చారి ప్రధాన టార్గెట్ అతని కూతురేనని, ఈ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీసీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వివరించారు. ‘ మధ్యాహ్నం మూడున్నర గంటలసమయంలో కూతురు మాధవితో పాటు సందీప్‌పై మనోహరా చారి కత్తితో దాడి చేశాడు. ప్రేమ పెళ్లిని సహించని అతను కక్ష్యతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మనోహరా చారి కూతురినే టార్గెట్ చేసి చంపాలని ప్లాన్ చేశాడు. సందీప్‌ను చంపాలనే ఉద్దేశం తనకు లేదని మనోహర్ చారి దర్యాప్తులో వెల్లడించాడు. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తండ్రి చేతిలో మాధవి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సందీప్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. మాధవి ప్రేమ వ్యవహారం తనకు తెలియకుండా అతని భార్యా, కొడుకు దాచారని మనోహర చారి విచారణలో చెప్పాడు. ప్రణాళిక ప్రకారమే కూతురుకు కాల్‌చేసి రమ్మని చెప్పాడు.’ అని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాని డీసీపీ పేర్కొన్నారు.
బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు ఈ నెల 12న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్‌మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరవకముందే అదే తరహా ఘటన మరోకటి చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment