ప్రణయ్‌ హత్య కేసు మరువకముందే మరో ఘటన | Hyderabad Father Attack On Lovers With Knife in erragadda | Sakshi

ప్రణయ్‌ హత్య కేసు మరువకముందే మరో ఘటన

Sep 19 2018 5:23 PM | Updated on Mar 22 2024 11:28 AM

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్నతండ్రి, సెటిల్‌మెంట్‌ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు.

మాధవి, సందీప్‌లు స్కూటీపై వెళుతుండగా.. యువతి తండ్రి బైక్‌పై వచ్చి తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. స్థానికుల అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా బెదిరించాడు. స్కూటీపై వెళుతున్న నవజంటపై ఎర్రగడ్డ ప్రాంతంలోని నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రేమజంటను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement