సాక్షి, మెదక్: కలిసి జీవించాలని భావించిన వారికి సామాజిక వర్గాలు, వయసులో ఉన్న వ్యత్యాసం అడ్డుపడ్డాయి. దీంతో కలిసి జీవించలేని జీవితంపై విరక్తి పుట్టి బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 5వ తేదీన కనిపించకుండా పోయిన ప్రేమజంట మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రలో మునిగిపోయాయి.
పోలీసుల కథనం మేరకు.. నాగిలిగిద్ద మండలం మాయినెళ్లి గ్రామానికి చెందిన అనిల్ (25)సంగారెడ్డిలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన కష్ణవేణి (28)లు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుందామని ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. అయితే వీరి సామాజిక వర్గాలు, వయసులో వ్యత్యాసం ఉండడంతో ఇరు కటుంబాల పెద్దలు వివాహానికి నిరాకరించారు. ఈ క్రమంలో జనవరి 5న కష్ణవేణి, అనిల్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: (నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. తల్లికి వీడియో కాల్ చేసి..)
ఈ నేపథ్యంలో రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై వంతెన వద్ద ఓ బైక్ అనుమానాస్పదంగా నిలిచి ఉండటాన్ని పలువురు గుర్తించి రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించారు. బైక్ నెంబర్ ఆధారంగా సంగారెడ్డిలో తప్పిపోయిన వారు వినియోగించిన బైక్‌గా గుర్తించి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఓ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ మృతదేహాన్ని కుటుంబీకుల సాయంతో కృష్ణవేణిదిగా గుర్తించారు. శనివారం ఉదయం మరో మృతదేహం కొట్టుకురాగా అనిల్‌గా గుర్తించారు. మృతదేహాలను సంగారెడ్డి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపైకేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment