![Love Married Couple Attacked By Girl Relatives In Annavaram - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/11/love-couple.jpg.webp?itok=Ir9HrLZq)
సాక్షి, కృష్ణా : అప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి ఇంటికి వస్తున్న ప్రేమ జంటపై యువతి బంధువుల దాడి చేసి నవవధువును లాక్కెళ్లిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లికి చెందిన వేపూరి గోపి(23), అదే గ్రామానికి చెందిన భూపతి పూజిత(20) గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అన్నవరం గుడిలో వివాహం చేసుకున్నారు. వివాహనంతరం తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా పులిగడ్డ టోల్‌గేట్ వద్ద నవ దంపతులపై యువతి బంధువలు దాడి చేశారు. గోపిని తీవ్రంగా గాయపరచి పూజితను కిడ్నాప్ చేశారు. ఈ దాడిపై నవవరుడు గోపి అవనిగడ్డ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment