
గాయపడిన వాణి
మదనపల్లె టౌన్: ఓ జంట ప్రేమ వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన సంఘటన గురువారం రాత్రి కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం.. కురబలకోట మండలం అంగళ్లు ఎంబీటీ రోడ్డులో ఉంటున్న వాణి, జయకుమార్ దంపతుల కుమారుడు అదే వీధికి చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వారు వాణి, జయకుమార్‌ల ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ చితకబాదారు. అడ్డుకోబోయిన వాణి తల్లి శివమ్మ, సుమలతకు స్వల్పగాయాలయ్యాయి. వీరు ప్రతిఘటించడంతో దాడికి పాల్పడిన సురేష్‌బాబు, కృపాకర్‌రెడ్డి గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment