ప్రతీకాత్మక చిత్రం
ప్రేమకు రెండు మనసులు కలిస్తే సరిపోతుంది! అదే పెళ్లి విషయానికి వచ్చేసరికి రెండు కుటుంబాలు కలవాల్సి ఉంటుంది. అందుకే చాలా ప్రేమ కథలు పెద్దల అంగీకారం దగ్గరే చతికిలబడి పోతున్నాయి. ఒక వేళ పెద్దలు పెళ్లికి ఒప్పుకుంటే మటుకు.. మంచి పంతులుగారిని వెతుక్కోవాలి.. ఎవరికీ ఇబ్బంది లేని ఓ పెళ్లి రోజును ఫిక్స్ చేయాలి, పెళ్లి చేయటానికి మంచి కళ్యాణ మండపం.. ఒకటేంటి ఎన్నో పనులు.. పెళ్లంటే మాటలు కాదుగా మరి. ప్రేమించుకోవటం మాత్రమే జంట ఇష్టం. ఆ తర్వాత పెత్తనమంతా పెద్ద వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక జంట అభిప్రాయాలకు విలువుండదనే చెప్పొచ్చు.
ఒక వేళ ‘మీరు పెళ్లి చేసుకోవటానికి ఓ మంచి రోజును మీరే ఎంచుకోండి’ అని జంటను అడిగితే. ఎక్కువ శాతం జంటలు చెప్పేపేరు.. వాలెంటైన్స్ డే.. అవును! ఇదిప్పుడు ప్రేమికుల రోజు మాత్రమే.. పెళ్లిళ్లు చేసుకోవటానికి జంటలు ఎంచుకునే రోజు కూడా! అందుకే 55శాతం మంది యువత వాలెంటైన్స్ డేన పెళ్లి చేసుకోవటానికి ఉత్సాహం చూపిస్తోంది. ఓ ప్రముఖ మాట్రిమొనియల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం దాదాపు 1000మందిపై సైట్ సర్వే నిర్వహించింది. వీరిలో 55 శాతంమంది 26-33 సంవత్సరాల వయసు కల్గిన వారే. ‘మీరు పెళ్లి చేసుకోవటానికి ఏ రోజును ఎంచుకుంటారు’ అని అడిగినపుడు.
వీరంతా వాలెంటైన్స్ డేకే ఓటేశారు. రొమాంటిక్ డేనే తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది మహిళలు వాలెంటైన్స్ రోజున ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నట్లు తేలింది. 25 శాతం మంది వాలెంటైన్స్ డేను తమ ప్రియమైన వారితో గడపటానికి ఇష్టపడ్డారు. 4 శాతం మంది బీజీ లైఫ్‌కు దూరంగా పేరెంట్స్‌తో వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడ్డారు.
చదవండి : ప్రేమికుల రోజునే.. పెళ్లి బాజాలు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment