వాలెంటైన్స్ డే వేడుకలు నిన్నటితో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రేమ జంటలు గులాబీలు, ప్రేమ కానుకలు, క్యాండీల్ లైట్ డిన్నర్లు, వెకేషన్లతో తమకు తోచినట్లుగా రోజును గడిపేశాయి. అయితే వాలెంటైన్స్ డేను గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్న కొన్ని ప్రేమ జంటలకు మాత్రం నిరాశే ఎదురైంది. ఆ ప్రేమ జంటల్లో ఒక్కోరిది ఒక్కో అనుభవం. వారంతా లవర్స్ డే వేడుకల సందర్భంగా తాము ఎదుర్కొన్న వింత అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సందిట్లో సడేమియా అంటూ వ్యాపారులు తమను మోసం చేసిన తీరును, ఒకరికి చేరవల్సిన కానుకలను, గిఫ్ట్ కార్డులను ఇంకొకరి పంపి కొరియర్ సంస్థలు ఇబ్బంది పెట్టిన వైనాన్ని వివరిస్తూ తోటి నెటిజన్ల ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు.
1) నాకు రోజా పూలంటే నచ్చవు. కానీ, నా భర్త వాలెంటైన్స్ డే సందర్భంగా వాటిని నాకు బహుమతిగా ఇచ్చాడు. వాటిని చూడగానే ఫీల్ మొత్తం పోయింది. దేవుడా! వాడిన పూలను ఎందుకమ్ముతారో!!
2) ఖర్మ కాలి ఓ వారం రోజుల ముందు రోజా పూలు ఆర్డర్‌చేశా. 13న డెలివరీ ఇచ్చారు! అదీ కూడా వేరే అడ్రస్‌లో.. సగం వాడిన పూలను.
3) అయ్యో! వాలెంటైన్స్ రోజు టామీ అనే వ్యక్తికి వెళ్లాల్సిన విషెస్ కార్డు మా అడ్రస్‌కు వచ్చింది. దాని మీద‘ హ్యాపీ వాలెంటైన్స్ గే’ అని రాసి ఉంది. అయ్యా టామీ! ఎక్కడున్నావయ్యా! నీ కార్డు నా దగ్గరే ఉంది. వచ్చి తీసుకెళ్లు.
4) వాలెంటైన్స్ డే కోసం మా ఆయన్ని సర్‌ఫ్రెజ్ చేద్దామని 1800 పూలు ఆర్డర్ చేశా. మా ఆయనకు పంపించమంటే మా అమ్మకు ఆ పూలను పంపించారు.
5) వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా ఆయన నాకు విషెస్ కార్డు ఇచ్చాడు. నేను ఎంతో సంతోషంగా దాన్ని తెరిచి చూశాను. షాక్! దాన్లో హ్యాపీ యానివర్శరీ అని ఉంది.
6) నేను పబ్లిక్‌గా ‘మూన్‌పిగ్ యూకే’( కొరియర్ సంస్థ)కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను పంపినవి కాకుండా వేరే వాళ్ల వాలెంటైన్స్ కార్డును నా బాయ్‌ఫ్రెండ్‌కు పంపినందుకు. అటువైపు నా ఫొటోలు ఉన్న వాలెంటైన్స్ కార్డు అందుకున్న వారికి నా క్షమాపణలు.
Comments
Please login to add a commentAdd a comment