
లక్నో : ఆగ్రాలోని ఓ ప్రముఖ కాలేజీ అమ్మాయిలకు వింత సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో 'వాలెంటైన్స్ డే నాటికి ప్రతి అమ్మాయికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే. లేకపోతే కాలేజీలోకి అనుమతించం. అలాగే మీకు బాయ్‌ప్రెండ్ ఉన్నాడని నిరూపించడానికి అతనికి మీరు దిగిన లేటెస్ట్ ఫోటోలను మాకు చూపించాలి. సింగిల్ అమ్మాయిలను కాలేజీకి రావడానికి అనుమతించం. ఇది మీ భద్రత కోసమే' అంటూ ఓ కాలేజీ పేరిట సర్క్యులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి)
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైన ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్రొ.అశిశ్ శర్మ (అసోసియేట్ డీన్) సంతకంతో జనవరి 14న ఈ సర్క్యులర్ జారి అయింది. మొదట స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన ఈ సర్క్యులర్‌ను విద్యార్థులు సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ఇది ఫేక్ నోటీసు అని జవాబిచ్చింది. తమ కాలేజీ పరువు తీయడానికే ఎవరో కావాలని ఈ చెత్త సర్క్యులర్‌ను వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నోటీసులు కాలేజీ ఇవ్వదని స్పష్టం చేశారు. (వైరల్: వయసు తాత్కాలికం.. భార్య చేతి కర్ర శాశ్వతం)
Agra's St John's college circular asks girls to get a boyfriend by Feb 14, principal calls it fake! 😉😃🤣 pic.twitter.com/wqoyOYum36
— ASParsh! ❄️ (@ASP_009) January 27, 2021