
వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకిడుస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి క్రమంలో కుటుంబ సభ్యులకు దొరికిపోయి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వేరే మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది.
వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు చెప్పారు. దీంతో, భర్తకు తన ప్రవర్తన మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ భర్త మారకపోవడంతో విసుగుచెందింది.
ఈ క్రమంలో ఆమె భర్త సదరు మహిళతో కలిసి హోటల్ రూమ్‌లో ఉన్నాడన్న విషయాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్న భార్య అక్కడికి వెళ్లింది. అక్కడ వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తన చెప్పుతో చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా, ఈ ఘటనపై భార్య ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment