సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. రేపు(గురువారం) శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ మూసివేసింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తులకు అనుమతిని టీటీడీ అధికారులు రద్దు చేశారు.
కాగా, అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. కాలువు ఉప్పొంగుతున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందని, రోడ్లు మునిగిపోయాయని పెద్దసంఖ్యలో కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తుఫాను ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా కొరమేనుగుంట, గొల్లవానికుంట, జీవకోన, కొత్తపల్లె, కట్టకిందూరు. లక్ష్మీపురంతో పాటు కపిలతీర్థం, మాల్వాడీగుండం, పేరూరు నుంచి నగరంలోకి ప్రవేశించి నీటి పోటు అధికంగా ఉన్న ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే లీలా మహల్ సర్కిల్ నుంచి కరకంబాడి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
ఇదీ చదవండి: నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం
Comments
Please login to add a commentAdd a comment