srivari temple
-
రేపు శ్రీవారి నడక మార్గం మూసివేత
సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. రేపు(గురువారం) శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ మూసివేసింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తులకు అనుమతిని టీటీడీ అధికారులు రద్దు చేశారు.కాగా, అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. కాలువు ఉప్పొంగుతున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందని, రోడ్లు మునిగిపోయాయని పెద్దసంఖ్యలో కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా కొరమేనుగుంట, గొల్లవానికుంట, జీవకోన, కొత్తపల్లె, కట్టకిందూరు. లక్ష్మీపురంతో పాటు కపిలతీర్థం, మాల్వాడీగుండం, పేరూరు నుంచి నగరంలోకి ప్రవేశించి నీటి పోటు అధికంగా ఉన్న ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే లీలా మహల్ సర్కిల్ నుంచి కరకంబాడి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.ఇదీ చదవండి: నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం .. కోనేటిలో భక్తుల స్నానాలు
-
భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్... శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ► ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ► ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
Tirumala: నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం.. అర్జిత సేవలు రద్దు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు. ఇక ఆదివారం 80,964 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 27,657 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు లెక్క తేలింది. నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన నేడు మంగళవారం (జనవరి 16న) అత్యంత ఘనంగా జరగనుంది. ఇదే రోజు గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు. ఆనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఆర్జితసేవలు రద్దు : ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
28న శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయాన్ని పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న(శనివారం) మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉండగా.. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. -
తిరుమలలో నేడు గరుడ వాహన సేవ
-
తిరుమల ఉద్యానవనాల నుంచి శ్రీవారి కైంకర్య పుష్పాలు
-
మార్చిలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల: మార్చి 3 నుంచి 7 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. 3న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులను కటాక్షిస్తారు. 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో 3 సార్లు విహరిస్తారు. 5న శ్రీభూ సమేతంగా స్వామివారు 3 సార్లు, 6న 5 సార్లు, 7న 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు. ఈ కారణంగా ఆయా తేదీల్లో జరగనున్న ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది. కాగా, తిరుమలలో మార్చిలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ఆదివారం ప్రకటించింది. 3న శ్రీకులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 7న కుమారధార తీర్థ ముక్కోటి, 18న శ్రీఅన్నమాచార్య వర్ధంతి, 22న ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 30న శ్రీరామనవమి ఆస్థానం, 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. సర్వ దర్శనానికి 24 గంటలు తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,736 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.3.63 కోట్లు వేశారు. టైం స్లాట్ టోకెన్లు ఉన్నవారికి సకాలంలో, దర్శన టికెట్లు లేనివారికి 24 గంటల్లో, ఎస్ఈడీ టికెట్లు ఉన్నవారికి 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
నూతన పరకామణి భవనంలో లెక్కింపు ప్రారంభం
తిరుమల: శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నూతన పరకామణి భవనంలో ఆయన పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుమల పెద్దజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. త్వరలో ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దుతామన్నారు. -
శ్రీవారికి రికార్డు స్థాయిలో కానుకలు
తిరుమల: శ్రీవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి. జనవరి 1న రూ.7.68 కోట్లు కానుకల ద్వారా లభించినట్లు టీటీడీ తెలిపింది. జనవరి 1న భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం రాత్రి వరకు లెక్కించారు. శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 5 నుంచి 6 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని చేపట్టారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. త్వరితగతిన శ్రీవారి దర్శనం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నా నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్ స్లాట్ టికెట్లు పొందిన భక్తులకు త్వరితగతిన దర్శనం లభిస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని అన్ని సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, శ్రీవారిని మంగళవారం టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకుడు దేవినేని అవినాష్ దర్శించుకున్నారు. -
శ్రీవారికి తిరుప్పావై నివేదన
తిరుమల/తిరుపతి కల్చరల్: ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పారాయణం ప్రారంభమైంది. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. వేదాల సారమే తిరుప్పావై వేదాల సారమే తిరుప్పావై అని తిరుమల చిన్నజీయర్‌స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ప్రవచన కర్త చక్రవర్తి రంగనాథన్స్వామి ధనుర్మాసం గురించి వివరించారు. శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, హెచ్డీపీపీ ఏఈవో సత్యనారాయణ, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రోగ్రాం అధికారి పురుషోత్తం పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు ఒకటి నిండింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 48,928 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,322 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
8న 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: చంద్ర గ్రహణం కారణంగా నవంబర్ 8న ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా 8న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో 7న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా 8న శ్రీవాణి,రూ.300 దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి సర్వదర్శనానికి అనుమతిస్తారు. భక్తజనరంజకంగా ‘బాలకాండ’ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం 13వ విడత బాలకాండ అఖండ పారాయణం జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో బాలకాండలోని 61 నుంచి 65 సర్గల వరకు ఉన్న 137 శ్లోకాలను, యోగవాసిష్టం– ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలనూ పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. సర్వ దర్శనానికి 38 గంటలు తిరుమలలో 31 క్యూ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి 38 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 82,604 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 37,025 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.57 కోట్లు వేశారు. శ్రీవారి సేవలో ప్రముఖులు శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు, తెలంగాణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఏపీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సతీమణి లక్ష్మి రవి దర్శించుకున్నారు. -
తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ
-
స్వర్ణరథం పై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి వారు
-
Tirumala: ఆనంద నిలయ విమాన విశిష్టత
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువుండే నెలవు ఆనంద నిలయం. తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి ఉన్న ప్రదేశమే ఆనంద నిలయం. గర్భాలయమైన ఆనంద నిలయంపై నిర్మించిన బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానంగా పేరుపొందింది. ఈ విమాన నిర్మాణానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి బంగారు గోపురం మూడంతస్తులుగా ఉంటుంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలోను, మూడోది వర్తులాకారంలోను ఉంటాయి. ఏకశిలపై నిర్మితమైన ఆనంద నిలయ గోపురం ఎత్తు ముప్పయ్యేడు అడుగుల ఎనిమిది అంగుళాలు. గోపురం కింద ఉండే ప్రాకారం ఎత్తు ఇరవయ్యేడు అడుగుల నాలుగు అంగుళాలు. నేలపై నుంచి బంగారు కలశం వరకు ఆనంద నిలయ విమానం ఎత్తు అరవై ఐదు అడుగుల రెండంగుళాలు. మొదటి అంతస్తు పదిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి బొమ్మలూ ఉండవు. ఇందులో లతలు, మకర తోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఉంటాయి. రెండో అంతస్తు ఎత్తు పదడుగుల తొమ్మిది అంగుళాలు. ఇందులో నలభై బొమ్మలు ఉంటాయి. మకర తోరణంతో పాటు వరాహస్వామి, నరసింహస్వామి, వైకుంఠనాథుడు తదితర విష్ణు రూపాలు, జయవిజయులు, గరుడ, విష్వక్సేన, అనంత, ఆంజనేయ, మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. ఇందులో ఉత్తరంవైపు శ్రీవేంకటేశ్వరుడు విమాన వేంకటేశ్వరుడిగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలం విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా లభిస్తుందని భక్తుల విశ్వాసం. (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) గోపురం చివర వర్తులాకారంలో ఉండే అంతస్తు పదహారడుగుల మూడంగుళాల ఎత్తులో ఉంటుంది. ఇందులో మహాపద్మంతో పాటు ఇరవై బొమ్మలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లోను, నాలుగు మూలల్లోను ఎనిమిది సింహాలు ఉంటాయి. గోపుర కలశానికి ఆనుకుని ఉండే మహాపద్మంలో చిలుకలు, లతలు, హంసలు వంటి చిత్రాలు కనువిందు చేస్తాయి. శ్రీవారి గర్భగుడి నుంచి మలయప్పస్వామి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు విమాన ప్రదక్షిణ చేస్తూ బయటకు వెళతారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించే ఏ పూజాద్రవ్యమైనా, తోమాలసేవలో సమర్పించే పుష్పాలనైనా, అభిషేకానికి సమర్పించే ఆకాశగంగ తీర్థాన్నైనా విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళతారు. (క్లిక్ చేయండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
-
శోభాయమానంగా వసంతోత్సవాలు
తిరుమల: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా మండపం కనువిందు చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత భక్తులకు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం లభించింది. వసంతోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి తోడ్కొని వచ్చారు. ఉదయం ఆస్థానం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జీయర్ స్వాములు, ఏఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. నేడు స్వర్ణరథోత్సవం వసంతోత్సవాల్లో నేడు ఉదయం మలయప్పస్వామి స్వర్ణరథంపై మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. -
మార్చిలో 14 లక్షల దర్శన టికెట్లు
తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్: కోవిడ్ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఆంక్షల నడుమ దర్శనాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయడం, వైరస్ తగ్గుముఖం పట్టడంతో టీటీడీ మరింతమంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి నెలలో దాదాపు 14 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) కల్పించేందుకు టికెట్లు జారీచేయనుంది. మార్చిలో రోజుకు 25 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు (బుధవారం) ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతిలో కేటాయించనుంది. రేపటి నుంచి ఈనెల 28 వరకు అదనపు కోటా ఈనెల 24 (గురువారం) నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం ఆన్లైన్లో ఉంచనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు ఐదువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లోని కౌంటర్ల వద్ద ఇవ్వనుంది. మార్చి 10న విదేశీ నాణేల ఈ–వేలం తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యూఎస్ఏ, మలేసియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా మలేసియా నాణేలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, యూఎస్ఏ నాణేలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ–వేలం వేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ (వేలం) కార్యాలయాన్ని 0877–2264429 నంబరులో సంప్రదించాలని, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఓఎన్యూజీఓఎల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్ / డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏ.ఓఆర్జీ వెబ్సైట్లలో చూడాలని కోరింది. -
15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు
తిరుమల: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు అనుమతి మేరకు ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్‌లైన్‌లో రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లోనూ రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల అనుమతికి సంబంధించి ఈ నెల 17న జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల జారీకి సంబంధించి వెబ్ పోర్టల్ సిద్ధమైందన్నారు. టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించిన దాతలకు ప్రివిలేజ్ కింద శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 నుంచి భక్తులు టీటీడీ వెబ్సైట్ నుంచి శ్రీవారి ఉదయాస్తమాన సేవాటికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్వీబీసీలో ప్రచారం చేస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
-
శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ అంకురార్పణ జరిగింది. అర్చకులకు బాధ్యతల కేటాయింపు చేసే ప్రక్రియలో భాగంగా ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానివ్వకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీవ్రతం, కృష్ణాష్టమి వేడుకలు శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి వేడుకలను టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సమన్వయ సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో మంగళవారం అన్ని ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కో–ఆర్డినేటర్ల శిక్షణకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) అధికారులను ధర్మారెడ్డి ఆదేశించారు. సప్తగిరి మాస పత్రికలో చక్కటి కంటెంట్, శీర్షికలు ప్రచురించాలని సూచించారు. రెండేళ్లలో 1,000 అన్నమాచార్య సంకీర్తనలను స్వరపరచి ప్రజలకు అందించాలని, దీనికోసం స్వరకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా కన్నడ భాషలో సంకీర్తనలు స్వరపరచడానికి స్వరకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
తిరుమల : ఘనంగా చక్రస్నాన మహోత్సవం
-
నేడు తిరుమలలో పున్నమి గరుడ సేవ
సాక్షి, తిరుమల: తిరుమలలో ప్రతినెలా జరిగే పున్నమి గరుడసేవ గురువారం సాయంత్రం జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలో కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా ఈ నెలలో స్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా గురువారం, అక్టోబరు 31న, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడసేవ నిర్వహిస్తారు. -
నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 2.5 లక్షలు
తిరుమల: లాక్డౌన్ సడలించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభమైన జూన్ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 4 శ్రీవారి దర్శనం కోసం జూన్ 11 నుంచి జూలై 10 మధ్య ఆన్లైన్Œ ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్ చేసుకోగా 1,64,742 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకోగా అందులో 85,434 మంది దర్శనానికి వచ్చారు. 4 నెల రోజుల్లో హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు లభించింది. 13.36 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 4 మొత్తం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4 జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1,865 మంది టీటీడీ ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. టీటీడీ ఉద్యోగుల్లో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. -
తిరుమలలో ఘనంగా శ్రీవారి తెప్పోత్సవం