
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్...
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.
► ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
► శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
► వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
► ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
► తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
Comments
Please login to add a commentAdd a comment