పుష్కరిణిలో తెప్పోత్సవ గోపురం
తిరుమల: మార్చి 3 నుంచి 7 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. 3న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులను కటాక్షిస్తారు. 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో 3 సార్లు విహరిస్తారు. 5న శ్రీభూ సమేతంగా స్వామివారు 3 సార్లు, 6న 5 సార్లు, 7న 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు.
ఈ కారణంగా ఆయా తేదీల్లో జరగనున్న ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది. కాగా, తిరుమలలో మార్చిలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ఆదివారం ప్రకటించింది. 3న శ్రీకులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 7న కుమారధార తీర్థ ముక్కోటి, 18న శ్రీఅన్నమాచార్య వర్ధంతి, 22న ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 30న శ్రీరామనవమి ఆస్థానం, 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది.
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,736 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.3.63 కోట్లు వేశారు. టైం స్లాట్ టోకెన్లు ఉన్నవారికి సకాలంలో, దర్శన టికెట్లు లేనివారికి 24 గంటల్లో, ఎస్‌ఈడీ టికెట్లు ఉన్నవారికి 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment