సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ మార్గం గుండా ప్రతి రోజు ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్ర చెబుతుందని వివరించారు.
గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో బండరాళ్ళు పడి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన నడక మార్గాన్ని రూ.3.60 కోట్లతో మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను చైర్మన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment