చిత్తూరు : తిరుపతి నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి మెట్టు వద్ద బుధవారం అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న రెండు మినీ లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాల నుంచి భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లారీలను సీజ్ చేశారు.
ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారందరిని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.