Red sandalwood seized
-
భారీగా ఎర్రచందనం స్వాధీనం
కడప అర్బన్/చంద్రగిరి: వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణ పల్లి సమీపంలోని అడవుల్లో నిందితులు ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా తయారుచేసి వాహనాల్లోకి ఎక్కించి తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు, ఎస్ఏ కాశినాయన ఎస్ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 455 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జిల్లాలోని బి.మఠం మండలం సోమిరెడ్డి పల్లెకు చెందిన దేవర్ల సుబ్రమణ్యం, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మీనేకళ్లు గ్రామానికి చెందిన రావూరి ఉమాశంకర్, కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన ధనపాటి రమణయ్య, అదే మండలానికి చెందిన భూమ వసంతకుమార్ ఉన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడినా, వారికి సహకరించినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. కూరగాయల మాటున.. చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఆదేశాల మేరకు.. ఆర్ఎస్ఐ వాసు సిబ్బందితో కలసి శనివారం 3 గంటల సమయంలో మూలపల్లి వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఐచర్ వాహనం ఆపకుండా వేగంగా అధికారులను దాటి వెళ్లిపోవడంతో దానిని వెంబడించారు. కొంతదూరం వెళ్లగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. వాహనం తనిఖీ చేయగా సుమారు 14 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఆర్ఎస్ఐ వాసు మాట్లాడుతూ.. ఐచర్ వాహనం కింది భాగంలో ఎర్రచందనం ఉంచి, దానిపైన చెక్కలు ఏర్పాటు చేసి కూరగాయలను రవాణా చేసే వాహనం మాదిరి చేశారని తెలిపారు. దాడుల్లో పట్టుబడిన డ్రైవర్ తిరుపతికి చెందిన ప్రభాకర్‌గా గుర్తించామన్నారు. అనంతరం వాహనంతో పాటు ఎర్రచందనం, నిందితుడిని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. -
కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
-
రూ.20.22 లక్షల ఎర్రచందనం పట్టివేత
సిద్దవటం : మండలంలోని భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణం వైపున అక్రమంగా తరలిస్తున్న రూ.20.22 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఒంటిమిట్ట సీఐ ఉలసయ్య తెలిపారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం రావడంతో సిద్దవటం ఎస్ఐ లింగప్ప, సిబ్బంది, తిరుపతికి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్, భాకరాపేట చెక్‌పోస్టు అటవీ శాఖ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణ వైపు నుంచి తుర్రా వెంకటసుబ్బయ్య ఏపీ04 డబ్ల్యూ 8528 నంబరు గల ట్రాక్టర్లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా తుర్రా ప్రతాప్, తుర్రా ప్రభాకర్ పల్సర్ ద్విచక్ర వాహనంలో ట్రాక్టర్‌కు ముందు వైపున పెలైట్‌గా వెళుతున్నారు. పోలీసులను చూసిన వెంటనే తుర్రా ప్రతాప్, ప్రభాకర్ ద్విచక్ర వాహనాన్ని పడేసి పరారు కాగా, ట్రాక్టర్‌ను నడుపుతున్న తుర్రా వెంకట సుబ్బయ్య, సుబ్బరాజు పరారయ్యారు. ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న కూలీల మేస్త్రీ కొత్త మాధవరానికి చెందిన అలిశెట్టి వెంకట సుబ్బయ్య, అట్లూరు మండలం మాడపూరు గ్రామానికి చెందిన గాలిశెట్టి యల్లయ్య, మాధవరం-1కు చెందిన బొడిచెర్ల సుబ్రమణ్యం, నేకనాపురం పల్లె గోపయ్య, మాధవరం-1 అంబేద్కర్ నగర్ తిప్పన హరిబాబు, అలీనగర్ డేరింగుల వెంకటేశ్వరరావులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో కూలీ, మాధవరం-1కు చెందిన భాషాను శనివారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పట్టుబడిన 36 ఎర్రచందనం దుంగలు ఒక టన్ను 200 కిలోల బరువు ఉంటాయని, వీటి విలువ రూ. 20.22 లక్షలు కాగా, రూ. 4 లక్షలు విలువజేసే ట్రాక్టర్‌ను, రూ. 80 వేలు విలువజేసే పల్సర్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని సీఐ తెలిరు. తుర్రా వెంకట సుబ్బయ్య, ప్రతాప్, ప్రభాకర్, మిట్టపల్లెకు చెందిన చెంచయ్యనాయుడులను పట్టుకునేందుకు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని, వారికి సమాచారం ఇచ్చినా, ఎవరైనా సహకరించినా, వారితో తిరిగినా, వారిని ఆశ్రయించినా అటవీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వారికి ఎలాంటి సహకారం అందించవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ లింగప్ప, ఏఎస్ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ కురబత్, సిబ్బంది పాల్గొన్నారు. -
బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు
ఒంగోలు: బొప్పాయి పండ్ల కింద అక్రమంగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటాచర్లమోటు రహదారిపై ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి లోడ్‌తో వెళ్తున్న లారీని పోలీసులు ఆపారు. లారీలో లోడ్‌పై డ్రైవర్‌ను ప్రశ్నించగా... పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అనుమానించి... లారీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి పండ్లు కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం: స్మగ్లర్లు పరారీ
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనంతసాగరం మండలం పిలకలమర్రి వద్ద దాదాపు 50కి పైగా ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు.అందుకు సంబంధించి మూడు వాహనాలను పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు, అటవీశాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారైయ్యారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందన దుంగలను, వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. -
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నెల్లూరు: శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం వెంకటరామరాజుపేట సమీపంలో పోలీసులు మంగళవారం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి... స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 6 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం : స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లు అంతా తమిళనాడు, కుప్పం చెందిన వారని పోలీసులు తెలిపారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం ... కూలీలు అరెస్ట్
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా బాలుపల్లి అటవీప్రాంతంలోని కందుమడుగు వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా 9 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను సీజ్ చేసి, కూలీలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందన విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిన్న బద్వేలు సమీపంలోని లంకమల్ల అభయారణ్యంలో ఎర్రచందనం భారీ డంప్‌ను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎర్రచందనం తరలించేందుకు దాదాపు 150 మంది కూలీలు అడవిలో నక్కి ఉన్నారు ... ఫారెస్ట్ అధికారుల కూంబింగ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆ కూలీలంతా పరారైన సంగతి తెలిసిందే. -
శ్రీవారి మెట్టు వద్ద భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : తిరుపతి నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి మెట్టు వద్ద బుధవారం అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న రెండు మినీ లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాల నుంచి భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లారీలను సీజ్ చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారందరిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. -
పోలీసులు కాల్పులు: ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ
వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామ సమీపంలో లోతువంక అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది గత అర్థరాత్రి నుంచి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన స్మగ్లర్లు కూబింగ్ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు స్మగ్లర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైయ్యారు. ఘటనాస్థలంలో స్మగ్లర్ల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 20 బస్తాలకుపైగా ధాన్యం బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నాఉ. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువు రూ. కోటిపైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. -
రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజీ కుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని భారీ ఎత్తున అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులుకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్నఎర్రచందనం విలువు రూ. 5 కోట్లు వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఎర్ర చందనం తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం
చెరుకు గెడల అడుగున పెద్ద ఎత్తున్న ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని నెల్లూరు జిల్లా రాపూర్ సమీపంలో చిట్వేలీ గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం లారీని రాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
-
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి నగరంలోని బాకరాపేట ఘాట్ వద్ద ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన భారీ వాహనాన్ని అటవీశాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. దాదాపు 200 భారీ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అటవీ శాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు కాళ్లకు బుద్ది చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఎర్రచందనం తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారని, ఆ క్రమంలో తాము దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.