
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నెల్లూరు: శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం వెంకటరామరాజుపేట సమీపంలో పోలీసులు మంగళవారం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి... స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 6 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.