తిరుపతి నగరంలోని బాకరాపేట ఘాట్ వద్ద ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన భారీ వాహనాన్ని అటవీశాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. దాదాపు 200 భారీ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అటవీ శాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు కాళ్లకు బుద్ది చెప్పారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఎర్రచందనం తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారని, ఆ క్రమంలో తాము దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.