Rs 2 crore worth
-
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అందులోభాగంగా పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనాన్ని అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట మండలం మంటపంపల్లిలో భారీగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
-
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి నగరంలోని బాకరాపేట ఘాట్ వద్ద ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన భారీ వాహనాన్ని అటవీశాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. దాదాపు 200 భారీ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అటవీ శాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు కాళ్లకు బుద్ది చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఎర్రచందనం తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారని, ఆ క్రమంలో తాము దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.