బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు | Red sandalwood seized in prakasam district police | Sakshi
Sakshi News home page

బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు

Published Thu, Nov 27 2014 8:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

Red sandalwood seized in prakasam district police

ఒంగోలు: బొప్పాయి పండ్ల కింద అక్రమంగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.  ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటాచర్లమోటు రహదారిపై ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా బొప్పాయి లోడ్తో వెళ్తున్న లారీని పోలీసులు ఆపారు. లారీలో లోడ్పై డ్రైవర్ను ప్రశ్నించగా... పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అనుమానించి... లారీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి పండ్లు కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement