భారీగా ఎర్రచందనం స్వాధీనం: స్మగ్లర్లు పరారీ
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనంతసాగరం మండలం పిలకలమర్రి వద్ద దాదాపు 50కి పైగా ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు.అందుకు సంబంధించి మూడు వాహనాలను పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీసులు, అటవీశాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారైయ్యారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందన దుంగలను, వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.