Rs. 20 lakhs
-
చిట్టీల పేరుతో ఘరానా మోసం
రాజమహేంద్రవరం: చిట్టీల పేరుతో చుట్టు పక్కల వారికి రూ. 20 లక్షలు టోపీ పెట్టి ఓ దంపతులు తమ స్వగ్రామం పరారైన ఘటన ఇది. స్థానిక వీవర్స్ కాలనీలోని బాగిరెడ్డి కనకమాణిక్యం ఇంట్లో కడపకు చెందిన కారపురెడ్డి సాయి కృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. నమ్మకంగా ఉంటూ చుట్టుపక్కల వారితో చిట్టీలు వేయిస్తుంటారు. వారి వద్ద ఇంటి యజమాని నాగకనకరత్నం కూడా చిట్టీ వేసింది. అధిక వడ్డీలు ఆశ చూపిన సాయి కృష్ణారెడ్డి దంపతులు రూ.20 లక్షలు వసూలు చేసి శనివారం రాత్రి చెప్పాపెట్టకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్నకాలనీ బాధితులు బోడె కృష్ణ, సత్యవతి, ఇంటి యజమాని, తదితరులు మూడోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రామకోటేశ్వరరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షరీఫ్ తెలిపారు. -
రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం రాయపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారు. ఆ విషయాన్ని అధికారులు చాలా ఆలస్యంగా గుర్తించారు. దాంతో బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణ చేపట్టారు. అందులోభాగంగా బ్యాంకు ఉద్యోగిని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం: స్మగ్లర్లు పరారీ
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనంతసాగరం మండలం పిలకలమర్రి వద్ద దాదాపు 50కి పైగా ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు.అందుకు సంబంధించి మూడు వాహనాలను పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు, అటవీశాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారైయ్యారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందన దుంగలను, వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.