చిట్టీల పేరుతో ఘరానా మోసం | escape with Rs. 20 lakhs in east godhavari | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో ఘరానా మోసం

Published Mon, Apr 17 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

escape with Rs. 20 lakhs in east godhavari

రాజమహేంద్రవరం:  చిట్టీల పేరుతో చుట్టు పక్కల వారికి రూ. 20 లక్షలు టోపీ పెట్టి ఓ దంపతులు తమ స్వగ్రామం పరారైన ఘటన ఇది. స్థానిక వీవర్స్‌ కాలనీలోని బాగిరెడ్డి కనకమాణిక్యం ఇంట్లో కడపకు చెందిన కారపురెడ్డి సాయి కృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. నమ్మకంగా ఉంటూ చుట్టుపక్కల వారితో చిట్టీలు వేయిస్తుంటారు. వారి వద్ద ఇంటి యజమాని నాగకనకరత్నం కూడా చిట్టీ వేసింది.

అధిక వడ్డీలు ఆశ చూపిన సాయి కృష్ణారెడ్డి దంపతులు రూ.20 లక్షలు వసూలు చేసి శనివారం రాత్రి చెప్పాపెట్టకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్నకాలనీ బాధితులు బోడె కృష్ణ, సత్యవతి, ఇంటి యజమాని, తదితరులు మూడోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రామకోటేశ్వరరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షరీఫ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement