east godhavari
-
జోరువానలోనూ వైఎస్ జగన్ వెంటే జనం
-
209వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, తూర్పుగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 209వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆయన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సోమేశ్వరం, సీతమ్మ తోట, లొల్ల గ్రామం మీదుగా రాయవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 208వ రోజు ముగిసింది. ఆదివారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పసలపూడి, చెల్లూరు మీదుగా మాచవరం వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. నేడు జననేత 9.1కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 2,507.4కిలో మీటర్లు నడిచారు. -
కాపు రిజర్వేషన్లు అమలు చేయాలి
తూర్పు గోదావరి: కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ ఆధ్వర్యంలో ఆకలి కేకలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, మరికొంత మంది కాపు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. -
‘నువ్వు లేక నేను లేను’ అంటూ..
తొండంగి(తూర్పుగోదావరి): నువ్వు లేకపోతే ఉండలేనంటూ వెంటపడి లోబర్చుకుని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు పెళ్లి కోసం వివాహిత ఆందోళన చేసింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి తొండంగిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన వి.ప్రసన్న కుమారికి, తొండంగి గ్రామానికి చెందిన ఎం.శ్రీధర్‌కు నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రసన్నకు శ్రీధర్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ విషయం ప్రసన్న తల్లిదండ్రులకు తెలియడంతో సుమారు ఏడాదిన్నర కింద దగ్గరి బంధువైన మరో వ్యక్తితో వివాహం చేశారు. పెళ్లైన తర్వాత కూడా శ్రీధర్ ప్రసన్నకు నువ్వు లేకపోతే ఉండలేను అంటూ పెళ్లి చేసుకుంటానని తెలపడంతో ఆ మాటలు నమ్మిన ప్రసన్న పెళ్లైన భర్తను వదిలి వచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని తెలిపిన శ్రీధర్ మొహం చాటేయడంతో కుటుంబసభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన చేసింది. తనకు న్యాయంగా చేయాలంటూ వాపోయింది. లేనిపోని మాటలతో తమ కుమార్తెకు మాయమాటలు చెప్పడంతో కాపురం వదిలి వచ్చిందని, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే కుమార్తె జీవితం వీధిన పడుతుందని ప్రసన్న తల్లిదండ్రులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేందుకు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సదరు ప్రియుడు శ్రీధర్‌కు వివాహం కావడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
చిట్టీల పేరుతో ఘరానా మోసం
రాజమహేంద్రవరం: చిట్టీల పేరుతో చుట్టు పక్కల వారికి రూ. 20 లక్షలు టోపీ పెట్టి ఓ దంపతులు తమ స్వగ్రామం పరారైన ఘటన ఇది. స్థానిక వీవర్స్ కాలనీలోని బాగిరెడ్డి కనకమాణిక్యం ఇంట్లో కడపకు చెందిన కారపురెడ్డి సాయి కృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. నమ్మకంగా ఉంటూ చుట్టుపక్కల వారితో చిట్టీలు వేయిస్తుంటారు. వారి వద్ద ఇంటి యజమాని నాగకనకరత్నం కూడా చిట్టీ వేసింది. అధిక వడ్డీలు ఆశ చూపిన సాయి కృష్ణారెడ్డి దంపతులు రూ.20 లక్షలు వసూలు చేసి శనివారం రాత్రి చెప్పాపెట్టకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్నకాలనీ బాధితులు బోడె కృష్ణ, సత్యవతి, ఇంటి యజమాని, తదితరులు మూడోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రామకోటేశ్వరరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షరీఫ్ తెలిపారు.