జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. స్మగ్లర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లు అంతా తమిళనాడు, కుప్పం చెందిన వారని పోలీసులు తెలిపారు.