
సాక్షి, తిరుపతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనాతో మానవాళి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.. త్వరగా మెడిసిన్, వ్యాక్సిన్ వచ్చేలా ఆశీర్వదించాలని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. శ్రీవారి దర్శన అనుమతికి ఇబ్బందులు ఎదురవుతున్నా, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు.
24 గంటలూ పూర్తిస్థాయి సిబ్బందితో..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్పత్రులకు అదనపు బలాన్ని చేకూరుస్తోందని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10 వేల వైద్య పోస్టుల భర్తీకి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఇకపై 24 గంటలూ పూర్తిస్థాయిలో సిబ్బందితో ప్రభుత్వాస్పత్రులు పనిచేస్తాయని విజయసాయిరెడ్డి తెలిపారు.
(చదవండి: కొండలకు కోట్లిచ్చిన ఘనులు!)
(బినామీ ‘బాబు’కు చెక్)
Comments
Please login to add a commentAdd a comment