తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు | Vaikunta Ekadasi And Dwadasi Arrangements In TTD | Sakshi
Sakshi News home page

తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు

Published Tue, Dec 31 2019 1:15 AM | Last Updated on Tue, Dec 31 2019 1:51 AM

Vaikunta Ekadasi And Dwadasi Arrangements In TTD - Sakshi

తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరాది,జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ లోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 31, జనవరి 1వ తేదీల్లో అన్ని ఆర్జిత సేవలతో పాటు దాతలు, వృద్ధులు, దివ్యాం గులు, చంటిపిల్లల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేసినట్టు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతో పాటు ప్రివిలేజ్డ్‌ దర్శనాలు, రూ. 300 దర్శన టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశామని వివరించారు.

జనవరి 7న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 5 వేల మంది భక్తులకు గతంలోనే ఆన్‌లైన్‌లో కేటాయించామన్నారు. జనవరి 6న తెల్లవారుజామున 2 నుంచి వైకుంఠ ద్వార దర్శ నం ప్రారంభమవుతుందని తెలిపారు. నారాయణ గిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో జనవరి 5న ఉదయం 11 నుంచి రాత్రి 12 వరకు నామసంకీర్తన యజ్ఞం నిర్వ హిస్తామని వెల్లడించారు. ఈ సమీక్షలో టీటీటీ చీఫ్‌ ఇంజనీర్‌ రామచంద్రారెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ–2 నాగేశ్వరరావు, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్స్‌) వెంకటేశ్వర్లు, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, హెచ్‌డీపీపీ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్‌ తదితరులు పాల్గొన్నారు.

జనవరిలో విశేష ఉత్సవాలు
జనవరి నెలలో తిరుమల ఆలయంలో పలు విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 6న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు, 7న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, అలాగే 7 నుంచి 13 వరకు ఆండాళ్‌ నీరాటోత్సవం, 11న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 14న భోగి, 15న మకర సంక్రాంతి. 16న శ్రీవారి పార్వేట ఉత్సవం, శ్రీ కూరత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 19న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 30న వసంతపంచమి తదితర విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement