Akkineni Nagarjuna And Amala Visits Tirumala Venkateswara Temple, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Nagarjuna - Amala: శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు

Jan 21 2022 12:04 PM | Updated on Jan 21 2022 12:51 PM

Akkineni Nagarjuna Visits Tirumala Srivari Temple - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణి అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన.. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత స్వామి వారిని దర్శించుకున్నాని అన్నారు. ఈ ఏడాది కరోనా అంతమై ప్రపంచంలో ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను నటించిన బంగార్రాజు చిత్రాన్ని కరోనా సమయంలోనూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement