
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరక చతుర్దశి పర్వదినాన దీపావళి వెలుగులా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు రావాలని కోరుకుంటున్నన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment