విజయవాడ: నగరంలోని ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడెవరన్నది పోలీసులు గుర్తించారు. చిక్కడు దొరకడు అన్నట్టుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆ ఘరానా దొంగ ఆనవాళ్లను పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.
1998లో దుర్గగుడిలో చోరీకి పాల్పడిన ప్రకాశ్ కుమార్ సాహునే నిందితుడిగా పోలీసులు నిర్థారించారు. అయితే నిందితుడు సాహు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.