
Shilpa Shetty And Raj Kundra: గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భర్తపై కోపంతో ఉన్న శిల్పా అతడితో విడాకులు తీసుకోనుందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే గతంలో విడాకుల రూమర్లను శిల్పా కొట్టిపారేయడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇక తాజాగా వీరి విడాకుల వ్యవహరం మరోసారి చర్చనీయాంశమైంది.
చదవండి: Mahesh Babu: డైరెక్టర్ శంకర్‌కు మహేశ్ క్షమాపణలు, కారణమేంటో తెలుసా?
రాజ్‌కుంద్రా తన పేరుపై ఉన్న ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చడంతో మరోసారి ఈ జంట విడాకులు వార్తల్లో నిలిచింది. కాగా రీసెంట్‌గా తన పేరుపై ఉన్న విలువైన ఆస్తులను రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి పేరు మీదకు మార్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సడెన్‌గా ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చడం వెనుక అంతర్యం ఏముందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఈ జంట విడాకులకు సిద్ధమైందని, త్వరలోనే వారి వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
చదవండి: శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్‌కుంద్రా!
పోర్నోగ్రఫి కేసు తర్వాత రాజ్‌కుంద్రా, శిల్పాల మధ్య తరచూ విభేదాలు వస్తుండటంతో విరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట మధ్య ఆస్తుల పంపకం జరుగుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై శిల్పాశెట్టి దంపతులు స్పందించే వరకు వేచి చూడాలి. కాగా రాజ్‌కుంద్రా.. ముంబైలో జుహులోని ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడట. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లను కూడా శిల్పా పేరు మీదకు బదలాయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment