సొంత విమానం ఉంటే ఆ మజానే వేరు! | A Plane Full of Shilpa Shetty 'First Class Friends' | Sakshi
Sakshi News home page

సొంత విమానం ఉంటే ఆ మజానే వేరు!

Published Thu, Feb 18 2016 5:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సొంత విమానం ఉంటే ఆ మజానే వేరు! - Sakshi

సొంత విమానం ఉంటే ఆ మజానే వేరు!

భోపాల్: బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ వెలుగొందిన శిల్పాశెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మిత్రులు, సన్నిహితులతో ఓ టూర్ కు వెళ్లింది. టాప్ హీరోలు,హీరోయిన్లు కలిసి జర్నీ చేయడంతో టూర్ ఫొటోలపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని పెద్ద నగరాలలో ఒకటైన భోపాల్ కు ప్రైవేట్ జెట్ ఫ్లైట్ లో వెళ్లారు. ఫిబ్రవరి 16 రాత్రి జరిగిన ఓ పార్టీకి భర్త రాజ్ కుంద్రాతో కలిసి పొడుగుకాళ్ల సుందరి సరదాగా గడిపింది. మొత్తంగా ఏ క్లాస్ స్టార్లు మాత్రమే ఉన్న ఈ ప్రైవేట్ జెట్ ప్లయిట్ లో శిల్పా దంపతులు వారితో ముచ్చటిస్తూ జాలీగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణించారు.

ప్రైవేట్ జెట్ ఫ్లయిట్ ఉంటో నిజంగా ఎంతో మేలు అంటూ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ట్వీట్ చేశారు. మనకు సొంతంగా జెట్ ఫ్లయిట్ ఉంటే ఉండే అనుభూతే వేరు అంటూ పేర్కొన్నారు. 'ఫస్ట్ క్లాస్ ఫుల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్' అని తన పోస్టుల్లో చెప్పుకొచ్చాడు. రెండేళ్ల పాటు నిషేధానికి గురైన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సహయానిగా రాజ్ కుంద్రా వ్యవరిస్తున్న విషయం తెలిసిందే. టబు, హుమా కురేషీ, అనిల్ కపూర్, అతని సోదరుడు సంజయ్ కపూర్ దంపతులు, సునీల్ శెట్టి, చంకీ పాండే, తదితర నటీనటులు శిల్పాశెట్టి దంపతులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement