
'వంద జన్మలకైనా ఆయనతోనే పెళ్లి'
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (42) తన భర్త రాజ్‌కుంద్రా (41)పై ప్రేమను అమాంతం కుమ్మరించింది. ఎంతలా అంటే వాటి ప్రభావంతో ఆయన తడిసి ముద్దయ్యేలా.
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (42) తన భర్త రాజ్‌కుంద్రా (41)పై ప్రేమను అమాంతం కుమ్మరించింది. ఎంతలా అంటే వాటి ప్రభావంతో ఆయన తడిసి ముద్దయ్యేలా. రాజ్‌కుంద్రా తాజాగా తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్టైలిష్‌గా గడ్డం పెంచి కోరమీసం పెంచిన రాజ్‌కుంద్రాతో కలిసి దిగిన సెల్ఫీని ఆమె పోస్ట్ చేస్తూ ఆయనను భర్తగా కలిగి ఉండటం తన అదృష్టం అని చెప్పింది. తనకు నిజమైన ఆత్మ ఆయనే అంటూ మురిసిపోయింది.
అంతేకాదు.. వంద జన్మలకైనా, వంద ప్రపంచాల్లోనైనా, వంద రూపాల్లోనైనా ఎక్కడున్నా వెతికి పట్టుకొని మళ్లీ మళ్లీ ఆయనే పెళ్లి చేసుకుంటానంటూ తెలిపింది. ఆయన ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా ఆయనను ప్రేమగా ముచ్చాద్ కుకీ అంటూ పిలుచుకుంది.