పోర్న్‌ వర్సెస్‌ ప్రాస్టిట్యూషన్‌: అది ఎందుకు లీగల్‌ కాదు? | Raj Kundra 9 Years Old Tweet On Adult Movies Goes Viral | Sakshi
Sakshi News home page

Raj Kundra Arrest: పొలిటీషియన్స్‌ పోర్న్‌ చూస్తారు, పోర్న్‌ స్టార్లు..

Published Wed, Jul 21 2021 10:25 AM | Last Updated on Wed, Jul 21 2021 12:26 PM

Raj Kundra 9 Years Old Tweet On Adult Movies Goes Viral - Sakshi

యాక్టర్లు క్రికెట్‌ ఆడతారు, క్రికెటర్లు రాజకీయాలు చేస్తారు. రాజకీయ నాయకులు అశ్లీల చిత్రాలు చూస్తారు. పోర్న్‌ స్టార్లు యాక్టర్లుగా మారుతారు...

Raj Kundra Old Tweets Viral: పోర్న్‌ వీడియోల కేసులో అడ్డంగా బుక్కైన వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా గతంలో చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తొమ్మిదేళ్ల క్రితమే ఆయన పోర్నోగ్రఫీ గురించి సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తావించాడు. పోర్న్‌ చూడటం తప్పేం కాదని అభిప్రాయపడ్డాడు. "పోర్న్‌ వర్సెస్‌ వ్యభిచారం.. కెమెరా ముందు డబ్బులిచ్చి చేయించేది చట్టబద్ధం అయినప్పుడు మిగతాది మాత్రం ఎందుకు లీగల్‌ కాదు?" అని ప్రశ్నించాడు. 2012 మార్చి 29న ఈ ట్వీట్‌ చేశాడు.

అదే ఏడాది మేలో "యాక్టర్లు క్రికెట్‌ ఆడతారు, క్రికెటర్లు రాజకీయాలు చేస్తారు. రాజకీయ నాయకులు అశ్లీల చిత్రాలు చూస్తారు. పోర్న్‌ స్టార్లు యాక్టర్లుగా మారుతారు.." అంటూ మరో ట్వీట్‌ చేశాడు. పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ అయిన నేపథ్యంలో ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు అతడిని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. బహుశా అతడి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికినట్లుందంటున్నారు. ఇక ఈ పోర్నోగ్రఫీ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్‌ అయ్యారు. ఇందులో రాజ్‌ కుంద్రాతో పాటు అతడి సమీప బంధువు ర్యాన్‌ తోర్పే కూడా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement