
Raj Kundra Reentry To Instagram Fallows Only One Account: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూలై 19, 2021న అరెస్టయిన రాజ్ కుంద్రా సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదల అయ్యాడు. పోర్నో గ్రఫీ కేసులో ఇరుక్కోవడంతో తన ఇన్‌స్టాలోని పోస్టులను తొలగించడమే కాకుండా పూర్తిగా డిలీట్ కూడా చేశాడు. తాజాగా మళ్లీ తిరిగి సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రాజ్ కుంద్రా. ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌ను తిరిగి ఓపెన్ చేసి ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు ఈ వ్యాపార వేత్త. ప్రస్తుతం రాజ్ కుంద్రా ఫాలో అయ్యే అకౌంట్ ఎవరిదా అనే ఆలోచనలో పడ్డారు నెటిజన్స్.
రాజ్ కుంద్రా కొత్త అకౌంట్‌కు సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఆ అకౌంట్‌కు వెరిఫైడ్ మార్క్ కూడా ఉంది. రాజ్ కుంద్రాను 10 లక్షల మంది ఫాలో అయితే అతను మాత్రం ఒకే ఒక అకౌంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఆ అకౌంట్ అతని భార్య శిల్పా శెట్టిదో లేదా అతని కుమారుడు వియాన్‌ది అని అనుకుంటే పొరపడినట్లే. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా బాంద్రాలోని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఆ రెస్టారెంట్‌లో అతడికి భాగస్వామ్యం ఉంది. అందుకే ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2021 డిసెంబర్‌లో తాను ఫోర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించలేదని, డిస్ట్రిబ్యూట్ చేయలేదని చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇదీ చదవండి: సాయిబాబా సన్నిధిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా
Comments
Please login to add a commentAdd a comment