హలీవుడ్ చిత్రంగా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పుస్తకం!
ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పశెట్టి భర్త రాజ్ కుంద్రా రచించిన పుస్తకం ఆధారంగా హలీవుడ్ లో ఓ సినిమాను నిర్మించనున్నారు. రాజ్ కుంద్రా 'హౌ నాట్ టూ మేక్ మనీ' అనే పుస్తకాన్ని శుక్రవారం ముంబైలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...'నాకు సినిమాలను అమితంగా ఇష్టపడుతాను. నేను సినిమాను చూసిన ఫీలింగ్ కలిగే విధంగా కథను రాస్తాను. నా ఆలోచనలన్ని అలానే ఉంటాయి' అని రాజ్ కుంద్రా అన్నారు. సినిమా నిర్మాణం గురించి ప్రస్తుతం ఓ హాలీవుడ్ సంస్థతో మాట్లాడుతున్నాను. ఇంకా ఏమి ఫైనలైజ్ కాలేదు అని రాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శిల్పశెట్టి మాట్లాడుతూ.. 'త్వరలోనే ఈ పుస్తకం సినిమాగా రానుంది. రాజ్ ఎప్పుడూ గొప్పగా ఆలోచిస్తాడు' అని పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాక తన కంటే రాజ్ కు సినిమాలు అంటే పిచ్చి అని..అనేక సినిమాలో షారుఖ్ ఖాన్ పేరు రాజ్ అని ఉంటుందని.. ఆ పేరుకు మా ఆయన సరిగ్గా సరిపోతారు అని అన్నారు. 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రంలో షారుఖ్ ఖాన్ లా రాజ్ కూడా రొమాంటిక్ అని అన్నారు.
లండన్ లో నివసించే ముగ్గురి స్నేహితుల కథ హౌజ్ నాట్ టూ మేక్ మనీ అని తెలిపారు. లండన్ కు చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి 2009లో వివాహమాడారు.