నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడతావా?.. శిల్పాశెట్టి భర్తపై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్! | Uorfi Javed Slams Raj Kundra Him For Commenting On Her Dressing Sense | Sakshi
Sakshi News home page

Uorfi Javed: ఉర్ఫీ డ్రెస్సింగ్‌పై కామెంట్స్‌.. రాజ్‌కుంద్రాపై దారుణమైన పోస్ట్!

Published Sat, Oct 7 2023 9:39 AM | Last Updated on Sun, Oct 8 2023 2:59 PM

Uorfi Javed Slams Raj Kundra Him For Commenting On Her Dressing Sense - Sakshi

తన విచిత్రమైన వేషధారణతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ ‍చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఈ మాజీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ డ్రెస్సింగ్‌ సెన్స్‌పై శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన కామెంట్స్‌పై ఉర్ఫీ జావెద్ తీవ్రస్థాయిలో మండిపడింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇటీవల రాజ్ కుంద్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఉర్ఫీ జావెద్‌ గురించి ప్రస్తావించారు. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అయితే అతను తన డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ ఉర్ఫీకి ఆగ్రహం తెప్పించాయి. 'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తులపై మాట్లాడతాడా అంటూ.. క్షమించండి పోర్న్ కింగ్' అంటూ ఘాటుగానే స్పందించింది. కాగా.. ఉర్ఫీ పంచ్ బీట్ సీజన్- 2, బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా వంటి షోలలో కనిపించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో పాల్గొంది. 

రాజ్‌కుంద్రాపై కేసు
శిల్పాశెట్టి భర్త, రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేయడం వంటి ఆరోపణలపై వ్యాపారవేత్తను జూలై 2021లో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement