Raj Kundra Shilpa Shetty Recent Photo, After Porn Case Controversy - Sakshi
Sakshi News home page

Raj Kundra:రాజ్‌ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు

Nov 9 2021 4:43 PM | Updated on Nov 9 2021 6:45 PM

Raj Kundra And Shilpa Shetty Hand To Hand Appearance After Porn Case Controversy  - Sakshi

వారితోపాటు సెక్యూరిటీ గార్డ్స్‌ కూడా ఉండటం వైరల్‌ అవుతోంది. 

బాలీవుడ్‌ నటీ శిల్పా శెట్టీ, ఆమె భర్త రాజ్‌ కుంద్రా కలిసి జంటగా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రా అరెస్టయిన చాలా రోజుల తర్వాత వీరిద్దరు ఇలా చెట్టాపట్టాలు వేసుకుని తొలిసారి కనిపించారు. ఈ కపుల్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు మ‍్యాచింగ్‌ యెల్లో ఔట్‌ఫిట్‌లో ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని గుడి ప్రాంగణంలో కనువిందు చేశారు.  రాజ్‌ కుంద్రా పసుపు కుర్తా, తెలుపు పైజామా కాంబినేషన్‌లో ఉంటే.. శిల్పాశెట్టి పసుపు రంగుగల సల్వార్‌ కమీజ్‌ వేసుకున్నారు. వారు ఆలయంలో దర్శనం చేసుకోవడం, వారితోపాటు సెక్యూరిటీ గార్డ్స్‌ కూడా ఉండటం వైరల్‌ అవుతోంది. 

పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రా జులైలో అరెస్ట్‌ కాగా.. సెప్టెంబర్‌లో బెయిల్‌ మంజూరైంది. వ్యాపారవేత్త అయిన రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. అడల్ట్‌ వీడియోల నిర్మాణం, స్ట్రీమింగ్‌లలో పాల్గొనడం వంటి ఆరోపణలు వచ్చాయి. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టి వారి పిల్లలు వియాన్‌ రాజ్‌ కుంద్రా, సమీషా శెట్టి కుంద్రాలతో కలిసి ధర్మశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి తమ యాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను శిల్పా శెట్టి పంచుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్‌లలో రాజ్‌ కనిపించలేదు. మరోవైపు గత వారం, రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement