
ముంబై: బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలిపారు. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్’’అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
కాగా 90వ దశకం నుంచి బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శిల్పాశెట్టి.. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వియాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా వీరికి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. ఇక పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైన శిల్పాశెట్టి.. యోగాసనాల వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. నికమ్మ టైటిల్‌తో షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో త్వరలోనే బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.