
మా ఆయన మళ్లీ ప్రేమలో పడ్డాడనుకున్నా!
Published Sun, Oct 27 2013 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇదిలా ఉంటే... ఆల్రెడీ తనను ప్రేమించి, పెళ్లి చేసుకున్న రాజ్ మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడ్డారేమోనని శిల్పాకి సందేహం వచ్చిందట. దాని గురించి ఆమె చెబుతూ -‘‘ఈ మధ్యకాలంలో రాజ్ ఎప్పుడు చూసినా ఫోన్లతో బిజీగా ఉండటం గమనించాను. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండటంతో ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకున్నాడేమో అనిపించింది. కానీ, రాజ్ మాట్లాడుతున్నది తన కో-రైటర్ ఆర్యతో అని ఆ తర్వాత తెలిసింది. ‘హౌ నాట్ టు మేక్ మనీ’ అని ఆయన ఓ పుస్తకం రాశారు.
అందుకే నేను కూడా డైట్ గురించి లేక ఫిట్‌నెస్ మీద ఓ పుస్తకం రాయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. తను రాసిన పుస్తకం ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం నిర్మించాలనే ఆలోచన రాజ్‌కి ఉందట. దాని గురించి శిల్పా చెబుతూ - ‘‘రాజ్ సార్ధకనామధేయుడు. తన పేరుకి తగ్గట్టుగా ఆలోచనలన్నీ భారీగానే ఉంటాయి. అందుకని, ఈ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించి తీరతాడనే నమ్మకం నాకుంది’’ అని తెలిపారు.
Advertisement
Advertisement